ASF: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి మండల ప్రజలు కృషి చేయాలని దహేగాం ఎస్సై విక్రం అన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను సన్నిహితులతో చర్చించాలని, పిల్లల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. సరదా కోసం కూడా డ్రగ్స్ జోలికి వెళ్లవద్దన్నారు. డ్రగ్స్ వాడకం లేదా రవాణా మీ దృష్టికి వస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.