విశాఖ: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు సీఐ ఎర్రంనాయుడు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ మేరకు సీఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం కలగకుండా నిబద్ధతతో జీవించాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచుతున్నారని పేర్కొన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా, విక్రయంలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.