టీమిండియాకు అభిషేక్ శర్మ కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌కు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వార్నింగ్ ఇచ్చాడు. దూకుడుకూ ఓ హద్దు ఉండాలని తెలిపాడు. ప్రతి బంతిని ముందుకొచ్చి ఆడాలనుకుంటే ప్రత్యర్థి బౌలర్లు దానిపై దృష్టి పెట్టి బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తారని హెచ్చరించాడు. ప్రపంచకప్ సమయంలో దూకుడుగా ఆడే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.