చికెన్ అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చికెన్ ఎక్కువ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పోషకాహార లోపం ఏర్పడుతుంది. అంతేకాదు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చికెన్ వినియోగాన్ని నియంత్రించడం ముఖ్యమని, సమతుల్యమైన ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు.