సత్యసాయి: కదిరి మున్సిపాలిటీలోని పిల్లవంక కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ మహిళలు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా కాలనీలో నివాసముంటున్నామని రహదారులు, తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సమస్యను అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు.