TPT: బస్సు కింద పడి ఓ మహిళ చనిపోయిన ఘటన నాగలాపురం(M) రాజీవ్ నగర్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే కుమారుడి ఇంటికి వెళ్లడం కోసం అజీమా (70) RTC బస్సు ఎక్కింది. బస్సు దిగే సమయంలో అదుపుతప్పి కింద పడడంతో ఆమె చేయిపై బస్సు ఎక్కింది. దీంతో తీవ్ర గాయం కావడంతో తిరుపతికి తరలించారు. అక్కడ డాక్టర్లు చేతిని తొలగించి మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించారు. అక్కడ మృతి చెందింది.