ATP: ఆర్డీటీ స్టేడియంలో జరిగిన 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. అనంతపురంలో ఈ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత పని ఒత్తిడి ఉన్న రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.