ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కూచిపూడిపల్లెలో జొన్నలగడ్డ సృజన్(52) నిన్న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మద్యానికి బానిసైన సుజన్ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈక్రమంలో 4 రోజుల కిందట ఆయన భార్య కందుకూరులోని తన సోదరి ఇంటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి విపరీతంగా మద్యం తాగుతున్నాడు. ఆ మత్తులో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది.