VZM: జనాబ్ మౌలానా అబుల్ కలాం అజాద్ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.