NRPT: మొగ్దుంపూర్ గ్రామానికి చెందిన సత్యమ్మ అనారోగ్యంతో బాధపడుతూ.. శస్త్ర చికిత్సకు ఆర్థిక సహాయం కోసం మంత్రి వాకిటి శ్రీహరిని సంప్రదించింది. స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయనిధి కింద 3 లక్షల రూపాయల LOC మంజూరు చేయించారు. ఆదివారం మంత్రి శ్రీహరి తన అధికారిక నివాసంలో సత్తమ్మకు LOC అందజేశారు. ఆమెకు మంచి వైద్యం అంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.