ADB: నారాయణపేట జిల్లాలో ఈనెల 7 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి SGF అండర్-17 హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు ఫైనల్స్‌కు చేరింది. వివిధ జిల్లా జట్టులతో తలపడి ప్రతిభ కనబరిచిందని ఆదిలాబాద్ SGF సెక్రెటరీ తెలిపారు. క్రీడాకారులను ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్ష ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్, రమేష్ అభినందించారు.