MBNR: జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో ఈనెల 15 శనివారం రాత్రి యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా ఉత్సవ కమిటీ సభ్యలు MLA అనిరుధ్ రెడ్డిని హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆహ్వాన పత్రిక అందజేసి ఉత్సవంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.