ప్రకాశం: సీఎం చంద్రబాబు ఈనెల 11వ తేదీన ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మండలంలో MSME పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ముక్కు నర్సింహారెడ్డికి సమాచారం అందింది. అయితే సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే పెదచెర్లోపల్లికి బయలుదేరి వెళ్లారు.