TG: జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించాలని మాజీ MLA జగ్గారెడ్డి కోరారు. ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ ఉపఎన్నిక వచ్చిందని తెలిపారు. మరో 3 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి అని చెప్పారు. జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేసే శక్తి, యుక్తి నవీన్ యాదవ్‌కు ఉన్నాయని వెల్లడించారు.