హనుమకొండ జిల్లా కేంద్రంలో శనివారం నవ చేతన పుస్తక ప్రదర్శన కేంద్రాన్ని ఏసీపీ నరసింహ రావు ప్రారంభించారు. పుస్తక ప్రదర్శనను పరిశీలించి పలు విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, రచయిత గడ్డం కేశవమూర్తి పాల్గొన్నారు.