ATP: గుత్తి సునామ జకీని మాత అమ్మవారి ఆలయంలో శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు రాధాదేవి మాట్లాడుతూ.. కార్తీక మాసంలో భక్తులు ఉసిరి చెట్టు నీడలో భోజనం చేసి ప్రకృతిని పూజించడం ద్వారా శివ కేశవుల ఆశీస్సులు పొందుతాం అన్నారు.