KMM: వైరా మార్కెట్ కమిటీ పరిధిలోని తల్లాడలో సుమారు 25 అక్రమ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాయని రైతులు ఇవాళ ఆరోపించారు. అక్రమ పత్తి కొనుగోలు కేంద్రాలు యథేచ్ఛగా కొనసాగుతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారులు నోటీసులకే పరిమితమై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.