KMM: ఖమ్మం రూరల్ మండలంలోని కైకొండాయిగూడెంనకు చెందిన తూము గోపి (24) విద్యుద్షాక్తో శనివారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ నేతృత్వాన గోపి విద్యుత్ మరమ్మతులు చేయడానికి వెళ్లాడు. ముందుగానే ఎల్సీ తీసుకున్నప్పటికీ పని మధ్యలో స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురయ్యాడు. దీంతో గోపిని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.