జూ.ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ 2026 జనవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథలో చాలా మార్పులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.