WNP: బాల్యవివాహాలు చేసిన, ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేస్తామని అమరచింత ఎస్సై స్వాతి హెచ్చరించారు. అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామంలో మైనర్ బాలికకు బాల్య వివాహం చేసినందుకు ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలో ఓ బాలికకు బాల్య వివాహం జరిగిందనే సమాచారంతో ఐసీడీఎస్ విచారించగా బాల్య వివాహం చేసినట్లు తేలడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.