NLG: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలని డీఆర్డీవో ఎర్రబెల్లి శేఖర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని ఏం.గౌరారం, కుమ్మరిగూడెం, కనగల్ ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. రైతులు తమ ధాన్యాన్ని పొలాల వద్దే బాగా ఆరబెట్టి, తాలు, మట్టి గడ్డలు లేకుండా కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.