NGKL: తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ పురాతన చరిత్ర ఉంది. పూర్వం పాత గ్రామంలో అంటువ్యాధులు సోకడంతో, గడ్డం సాధువు చెప్పిన చోటికి ప్రజలు తరలి వెళ్లారట. దీంతో ఆ సాధువు పేరు మీదుగానే ఆ గ్రామానికి గడ్డంపల్లి అని పేరు వచ్చిందని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడ రెడ్డి వంశస్థులు పరిపాలించిన పురాతన ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.