TG: మాగంటి కుటుంబంపై దిగజారుడు రాజకీయాలు తగదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు. సీఎం కుర్చీ ఎవరికిచ్చినా రేవంత్ కంటే బాగా చేస్తారని విమర్శించారు. సీఎం పదవి కోసం ఉత్తమ్, భట్టి, మహేష్ రెడీగా ఉన్నారని తెలిపారు. జూబ్లీహిల్స్లో ఓడితే పదవి పోతుందని రేవంత్ భయమని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనపై రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.