ADB: ఆదిలాబాద్లో ఐపీ స్టేడియంలో సోమవారం అస్మిత అథ్లెటిక్స్ లీగ్ (2025-26) జిల్లాస్థాయి ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజా రెడ్డి తెలిపారు. అండర్ 14, 16 విభాగాల్లో బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.