ATP: నగరంలోని ఎంజీ మెటాలిక్ పక్కన ఉన్న నగరపాలక స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించి కాంపౌండ్ వాల్‌ను నిర్మించారు. ఆదివారం విషయం తెలుసుకున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, మున్సిపల్ అధికారులను ఆదేశించి ఆ స్థలాన్ని కట్టిన కాంపౌండ్ వాల్‌ను తొలగించారు. నగరంలో విలువైన నగరపాలక సంస్థ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.