TG: ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ‘నన్ను బెదిరించడానికి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ చేశాయి. 6 నెలలు బంద్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలి?. విద్య వ్యాపారం కాదు. ఫీజులు ఇస్తారా.. లేదా అని బంద్ పెట్టి బెదిరిస్తారా? రూల్స్ ప్రకారం వెళ్దామంటే చెప్పండి నేను సిద్ధంగా ఉన్నా. 100 శాతం రూల్స్ పాటించే కాలేజీలకు తక్షణమే బకాయిలు ఇస్తా’ అని పేర్కొన్నారు.