ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ను ఆదివారం గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఆవిష్కరించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు. ఈ నెల 12న జరగబోయే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.