HYD: ప్యాట్నీ- హకీంపేట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణను ఒక సంవత్సరం పాటు నిలిపివేస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు ఆస్తుల యజమానుల జేఏసీ డిమాండ్లు, హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భూసేకరణపై తుది నిర్ణయం తర్వాతే పనులు పునఃప్రారంభం కానున్నాయి.