MBNR: బీసీ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మోడల శ్రీనివాస్ సాగర్ అన్నారు. చాయ్ చర్చ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్ సాధించేవరకు బీసీలంతా పోరాడాలన్నారు.