కర్ణాటక బెటగేరిలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణ(38) అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. ఈ నెల 6న అతనికి ఆపరేషన్ చేయగా కాసేపటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు మృతదేహం అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా.. నారాయణ కళ్లు తెరవడంతో అందరూ షాకయ్యారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.