BHNG: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని ఐద్వా భువనగిరి పట్టణ సహాయ కార్యదర్శి మాటూరు కవిత అన్నారు. శనివారం పట్టణంలోని మీనానగర్లో ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ.. కరపత్రాలను ఆవిష్కరించారు. దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నా ఏదో ఒక రూపంలో మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు.