KRNL: హాలహర్వి మండలం నిట్రావట్టిలో నూతన రహదారి నిర్మాణానికి ఇవాళ టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి భూమిపూజ చేశారు. రహదారి పూర్తయితే గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆమె తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించేందుకు ఈ రహదారి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.