KRNL: ఆస్పరి మండలం కారుమంచి గ్రామం ఎమ్మిగనూరు నుంచి పత్తికొండకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో వర్షపు నీరు నిలబడి గ్రామస్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని బీఎస్పీ తాలూకా అధ్యక్షుడు కొమ్మ రమేశ్ మండిపడ్డారు. తక్షణమే ప్రధాన రహదారిపై పడిన గుంతలకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.