మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోల్ గ్రామంలో మందు డబ్బతో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. డోర్నకల్ మండలం పేరుమండ్ల సంకీస గ్రామానికి చెందిన యువకుడు శెట్టి లోకేందర్ తన భార్య కాపురానికి రావడం లేదని, ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.