W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కు ఇవాళ జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. గతవారం తుఫాన్ కారణంగా విధించిన ఆంక్షలు తొలగిపోవడంతో కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున బీచ్‌కు చేరుకున్నట్లు తెలపారు. ఉదయాన్నే సముద్ర తీరాన సేదతీరుతూ పర్యాటకులు ఆహ్లాదంగా గడిపినట్లు పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.