MNCL: నస్పూర్ పరిధిలోని ఊరు శ్రీరాంపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా కలపతో ఫర్నిచర్ తయారీ కేంద్రంపై అటవీ శాఖ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.3 లక్షలు విలువ చేసే కలపతో పాటు ఫర్నీచర్ తయారీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. అక్రమ కలప ద్వారా ఫర్నిచర్ తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.