నల్గొండలో హజరత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలు నెల రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. ఈ ఉత్సవాలలో హిందూ, ముస్లింలు కలసి పాల్గొనడంతో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉర్సు కమిటీ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలను విజయవంతంగా జరుగుతున్నాయి.