SKLM: సంతబొమ్మాళి(M) భావనపాడు బీచ్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. కార్తీకమాసంలో పిక్నిక్లకు స్పాట్‌గా ఉన్న ఇక్కడి జీడితోటల్లో కుటుంబాలు, స్నేహితులు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు వచ్చి వనభోజనాలు చేసారు. సముద్రపు స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. స్థానిక మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐడీ రాము, ఎస్సై శ్రీనివాసరావు సిబ్బంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.