VZM: జిందాల్ యాజమాన్యం తమ నుండి సేకరించిన భూములను తిరిగి ఇవ్వాలని కోరుతూ ఎస్‌కోట మండలం బొడ్డవర సమీప ప్రాంత గిరిజన రైతులు చేపట్టిన నిరసన ఆదివారం నాటికి 143వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జిందాల్ యాజమాన్యం తమ నుండి సేకరించిన భూముల్లో కంపెనీ కట్టనందున మా భూములను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.