ATP: గుంతకల్లులోని మార్కెట్ వద్ద గల మహబూబ్ సుభాని జెండా కట్ట వద్ద ఆదివారం భక్తిశ్రద్ధలతో గ్యార్మీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పకీర్లు, మత పెద్దలు, జెండా కమిటీ సభ్యులు జెండాతో పురవీధుల గుండా ఊరేగింపుగా జెండా కట్టకు చేరుకున్నారు. అనంతరం అక్కడ స్వామికి చక్కర చదివింపులు, పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.