SKLM: శ్రీకాకుళం యుటిఎఫ్ భవన్లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11 నుంచి 20 వరకు ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో జరగనున్న ‘సిక్కోలు పుస్తక మహోత్సవం’ను ప్రజలు విజయవంతం చేయాలని గిరిధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొన్నారు.