ELR: నూజివీడులోని మామిడి తోటలో ఆదివారం ఏర్పాటు చేసిన యాదవ్ కార్తిక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు యాదవ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. యాదవ కుటుంబ సభ్యులందరూ కలిసి మెలిసి ఐక్యతగా ఉండాలని సూచించారు.