రంజీ ట్రోఫీలో మేఘాలయ జట్టుకు చెందిన యువ బ్యాటర్ ఆకాశ్ కుమార్ చౌదరి చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో అతడు కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ఆకాశ్ వరుసగా ఎనిమిది సిక్సర్లు బాదడం మరో విశేషం.