NRML: మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. ఆమె ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 46 వాహనాలను సీజ్ చేసి, మైనర్లు, వారి కుటుంబ సభ్యులు దాదాపు 70 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలను, అనర్థాలను వారికి వివరించారు.