PLD: పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదివారం రామాంజనేయపురం గ్రామంలో రూ. 1.25 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, రోడ్డు పూర్తయితే గ్రామ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.