NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ నగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన గ్యార్మీ వేడుకలలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విద్యా కమిషన్ సభ్యులు వెంకటేష్, పొల్యూషన్ బోర్డు సభ్యులు బాలాజీ సింగ్ తదితరులు దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, షానవాజ్ ఖాన్, స్థానిక నాయకులు మసూద్ పాల్గొన్నారు.