GNTR: ఏపీ రైతు సంఘం డివిజన్ మహాసభ సోమవారం ఉదయం 10:30 గంటలకు తెనాలిలో జరగనుంది. ఈ మేరకు ఐతానగర్‌లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో జరుగుతుందని డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబశివరావు, శివ సాంబిరెడ్డి ఇవాళ తెలిపారు. గత 3 సంవత్సరాల నుంచి జరిగిన కార్యకలాపాలు, భవిష్యత్తు కర్తవ్యాలు నిర్దేశించుకోవడానికి తలపెట్టిన మహాసభలో రైతులు తరలి రావాలన్నారు.