NDL: కార్తీక మాసం సందర్భంగా ఆదివారం శ్రీశైలంలో భక్తుల రద్దీతో సందడి వాతావరణం నెలకొంది. దీంతో మల్లన్న దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ముందుగా పవిత్ర పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసి అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనార్థమై ఆలయ క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులు బారులు తీరారు.