GDWL: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు దండుకునేందుకే పాలక ప్రభుత్వాలు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మభ్య పెడుతున్నాయని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురవ పల్లయ్య ఆరోపించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ ఆదివారం చేశారు. బీసీల పట్ల ప్రభుత్వాలు కపట ప్రేమ చూపిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు.