MBNR: సమాజానికి ఉపాధ్యాయులు మార్గనిర్దేశకులు అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడు వెంకటయ్య సన్మాన సభకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. విద్య సమాజానికి వెలుగునిచ్చేశక్తి అని, ఆ వెలుగును పంచుతూ ఉపాధ్యాయులు సర్వోత్తములుగా నిలిచారని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.